Sunday 24 January 2016

Discourse with Revolutionary Writers Association

విరసం ( రివేర) సంవాదం

హైదరాబాద్‍
25 - 1-2016

రివేరాగారూ !

విరసం విజయవాడ సమావేశంలో  మీ  ప్రసంగంలో  పౌరసమాజాన్ని ప్రస్తావించారని తెలిసింది. వర్తమాన సమాజంలో పౌరసమాజం పనికిరాదని మీరు పేర్కొన్నట్టు మీ ప్రసంగాన్ని విన్నవారు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం కన్వీనర్ గా నేను దీని మీద స్పందించాల్సి వున్నది.  విరసంతో నేను ఇప్పటి వరకు సౌభ్రాతృత్వాన్ని కొనసాగిస్తున్నాను గనుక  మీ అభిప్రాయం మీద స్పందించడానికి  ముందు అసలు మీరు ఏమన్నారో మీ నుండే  తెలుసుకోవాలనుకుంటున్నాను. మూడు అంశాలను మీరు స్పష్టం చేయగలరు.

1. పౌరసమాజం పనికి రాదని చెప్పాల్సిన అవసరం మీకు విజయవాడ మహాసభలో ఎందుకు వచ్చింది?
2. పౌరసమాజం గురించి మీ అభిప్రాయం ఏమిటీ?
3. ఇది మీ అభిప్రాయమా? విరసం అభిప్రాయమా?

రెండు రోజుల్లో మీరు ఈ వివరణ ఇవ్వని పక్షంలో నేను విన్నది నిజమని భావించి దాని మీద స్పందిస్తాను.


అసంఖ్యాక పీడిత వర్గాలకు ముప్పువున్న ప్రస్తుత తరుణంలో వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసంఖ్యాక సంఘాలు, వ్యక్తుల మధ్య సౌభ్రాతృత్వ సంబంధాలు వుండాలని నేను భావిస్తున్నాను. అలాకాకుండా, ఘర్షణ సంబంధాలు వుండాలని మీరు భావిస్తే దానికీ నేను  సిధ్ధమే.

ఏం యం ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం.

Posted : 11.37 a.m.


11:56am
Varalakshmi Virasam
I couldn't hear to his speech completely as I was called by media persons. Getting the audio and video.
Present rivera is unavailable even on phone. I don't think he meant it (first point). Regarding his speech the approach and the theoretical depth is appreciated, at the same time, some differences  are also expressed. Pani who was presiding mentioned it.


12.. 09 p.m.
Subbaraju Chi
Anna, Your approach of ascertaining the fact from the speaker himself is a very reasonable, respectable and a confidence building measure. You have raised the bar of democratic discourse and decorum. I appreciate your gesture and second you as our leader.



3:05PM
Varalakshmi Virasam

Sir, విన్న వాళ్ళ నుండి clarify చేసుకున్నాను.
పౌరసమాజమా, వర్గసమాజమా అంటే మనది వర్గ సమాజం అని చెప్పాలి. మావోయిస్టులుగా మేమిది వర్గసమాజం అని చెప్తాం. రివేరా అన్నది ఇది. వర్గ దృష్టిని ఆయన emphasize చేశారు. ఇది మీ సంస్థ పౌరసమాజం గురించి గాని, సాధారణ అర్థం లో వాడే పౌరసమాజం గురించి గాని అన్నది కాదు. గమనించగలరు.  మా ప్రసంగ పాఠాలన్నీ అరుణతారలో వేస్తున్నాం. వీడియో విరసం  సైట్ లో అందరికీ అందుబాటులో  ఉంచబోతున్నాం. మీ సూచనలు ఆహ్వానిస్తున్నాం.
.. వరలక్ష్మి






Hydearbad
27-1-2016

రివేరాగారూ !

మీ వివరణ కోసం రెండు రోజుల గడువు ఇచ్చాము. దాన్ని ఇంకో మూడు రోజులు పోడిగించాము. అయినా మీరు స్పందించలేదు. రాళ్ళు వేయడమేతప్ప సంవాదం మీ విధానం కాదనుకుంటా!. ఇక విరసం మీద బహిరంగ ప్రకటన చేయడంతప్ప మాకు మరో మార్గం లేదు.

మీరు ఒక వివాదానికి తెరతీశారు. నేను నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద కొన్ని విమర్శలు చేశారు. దానికి ఫేస్ బుక్,  విరసంలను వేదికగా  వాడారు. అందువల్ల ఈ వివాదం  వ్యక్తిగతం కాకుండా సంస్థాగతంగా మారింది. మీ విమర్శలో రెండు విభాగాలున్నాయి. మొదటిది, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ప్రాసంగికత గురించి. రెండోది హిందూత్వ ఆచరణ గురించి. రెండవదయిన  హిందూత్వ అంశం  ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం పరిధిలోనిదికాదు కనుక దాన్ని విడిగా చర్చిస్తాను. ఇప్పటికి మనం ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద మీ విమర్శను పరిశీలిద్దాము.

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అవసరాలు, కోరికలకూ, ప్రభుత్వ పనితీరుకూ,  ఆబ్లిగేషన్లకూ మధ్య దూరం  పరీతంగా పెరిగిపోతున్నదనీ, దాన్ని పూరించడానికి పౌరసమాజం పూనుకోవాలనే నిరాడంబర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఆవిర్భవించింది. ఇది కొత్త అన్వయం, కొత్త సంస్థ, ఇంకా సన్నాహక దశలోనేవుంది.

విరసం ప్రకటిత లక్ష్యం పీడిత ప్రజల పక్షాన నిలబడడం కనుక దాన్ని మేము సోదర సంస్థగా భావిస్తాము. గొప్ప ప్రజాకవి, ఆలోచనాపరుడు మాత్రమేగాక వ్యక్తిగతంగానూ నాకు ఆత్మీయులు అయిన వరవరరావు  విరసంలో వుండడంవల్ల కూడా ఆ సంస్థ మీద మాకు అపార గౌరవంవుంది.

ఐక్యసంఘటన సాగించాల్సిన చారిత్రక సందర్భంలో  వివాదాన్ని మీరు మొదలెట్టారు. ఫేస్ బుక్ లోని మా వాల్ లోనికి వచ్చి నన్నూ, నేను ప్రాతినిధ్యం హిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరసమాజాన్నీ ఎద్దేవ చేశారు. పౌరసమాజం  కన్వీనర్ గా మారాక కందమూల ఫలాలు, ఆకులూ అలములు తింటున్నానుగానీ స్వతహాగా నేను మాంసాహారినే. అది మీకూ తెలుసు.  మీరు నామీదా, నా సంస్థ మీద బహిరంగంగా చేసిన విమర్శకు ప్రతిగా నేను మీమీదా, మీ సంస్థ  మీదా  ఆ క్షణంలోనే బహిరంగ విమర్శ చేయాలి. నేనూ, నా సంస్థ పనికిమాలినవాళ్ళం అని మీరు అనగలిగినపుడు మీరూ, మీ సంస్థా  పనికిమాలినవి అనడానికి ఎంతసేపు పడుతుందీ? కేవలం వరవరరావు మీద గౌరవంతో నేను ఆ పనిచేయలేదు. నేను పాటించిన ఒక వున్నత సాంప్రదాయాన్ని మీరు నా బలహీనతగా భావించారు.

ప్రజాస్వామిక విలువల్నీ, ఐక్యసంఘటన ధర్మాన్నీ  పాటిస్తూ నేను మీకు ఫోన్ చేసి మీకున్న అభ్యంతరం ఏమిటీ? అని అడిగాను. మాతో మీకు సైధ్ధాంతిక విబేధాలున్నాయనీ, వాటి గురించి ఫోనుల్లో కాకుండా సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం వుందన్నారు. నాకు తెలుసు మీరు సమగ్ర వాదనకు నిలబడరని. మీరు ప్రకటిత ’మావోయిస్టులు” కదా! మేధోరంగంలోనూ గెరిల్లా యుధ్ధాలు చేస్తారు. హిట్ అండ్ రన్!

ఆ తరువాత విరసం విజయవాడ మహాసభల ప్రసంగంలో (జనవరి 10) మీరు  పౌరసమాజాన్ని ప్రస్తావించి విమర్శించారు.  మామీద మీ దాడిని సమర్థించుకోవడానికి  ఆంటోనియో గ్రామ్ స్కీ ని విమర్శించారు. ఇటలీలో కమ్యూనిస్టు పార్టీల మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని భావించిన  తరువాత గ్రామ్ స్కీ పౌరసమాజం భావనకు ప్రాణం పోశాడు. తార్కికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో డానీ పౌరసమాజాన్ని ఆరంభించాడంటే అక్కడి  ప్రజలు కమ్యూనిస్టు పార్టీలని చీదరించుకున్నారనే అర్ధం వస్తుందని మీ భయం. చరిత్రకు కొత్త సూత్రాలేమీ వుండవు పాతసూత్రాలే పనిచేస్తుంటాయి.

రెండవసారి మీరు దాడి చేశారని తెలిశాక కూడా మేము తొందరపడలేదు. పరిస్థితిని సమీక్షించడానికి ఇంకో రెండు వారాలు ఆగాము.  అసంఖ్యాక పీడిత సామాజిక వర్గాలకు ముప్పువున్న ప్రస్తుత తరుణంలో వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసంఖ్యాక సంఘాలు, వ్యక్తుల మధ్య సోదర సంబంధాలు వుండాలనీ, సమస్యల  పరిష్కారం కోసం అందరం కలిసి ముందుకు సాగాలని  మేము భావిస్తున్నాము. మీ విమర్శ మీద స్పందించడానికి  ముందు అసలు  మీరు ఏమన్నారో మీ నుండే తెలుసుకోవాలను కున్నాను. 1. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం పనికి రాదని చెప్పాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది?  2. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం గురించి మీ అభిప్రాయం ఏమిటీ? 3. ఇది మీ అభిప్రాయమా? విరసం అభిప్రాయమా? అనే మూడు అంశాల మీద రాతపూర్వకంగా మీ వివరణ కోరాను. మీరు స్పందించలేదు.

మీ ఉపన్యాసాన్ని విందామని ఫేస్ బుక్ లో  https://www.facebook.com/arunatara.virasam వాల్ లోనూ, http://www.virasam.in/index.php వెబ్ సైట్‍ లోనూ వెతికాను. వాటిల్లో మీ ఉపన్యాసంతప్ప అందరి ఉపన్యాసాలూ వున్నాయి.  ఆ తరువాత విరసం కార్యదర్శి వరలక్ష్మీ, విరసం సభ్యులు  మరి కొందరితో నేను సంవాదం సాగించాను. వాళ్ల మెసేజులు, ఫోన్ సంభాషణలనుబట్టి మీరు మీ శక్తి మేరకు  ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద సైధ్ధాంతిక దాడి చేశారని తెలిసింది. "the approach and the theoretical depth is appreciated" అని మీ ఉపన్యాసాన్ని విరసం కార్యదర్శి మెచ్చుకున్నారు.  "మావోయిస్టులుగా మేమిది  వర్గసమాజం అని చెప్తాం. రివేరా అన్నది ఇది. వర్గ దృష్టిని ఆయన emphasize చేశారు." అని వారు ఒక వివరణ కూడా ఇచ్చారు.

వర్గము అనేది కమ్యూనిస్టు ప్రత్యయం, పౌరులు అనేది (పెట్టుబడీదారీ) ప్రజాస్వామ్య ప్రత్యయం అని మీరు వాదించి వుంటే నేను మిమ్మల్ని మెచ్చుకుని వుండేవాడిని.  అయితే ఈ విషయంలోనూ మీకు చిత్తశుధ్ధిలేదు. మావోయిస్టులయిన రచయితలు విరసాన్ని నడుపుతున్నట్టు, మావోయిస్టులయిన న్యాయవాదులు పౌరహక్కుల సంఘాన్ని నడుపుతున్నారన్న విషయాన్ని మీరు తెలివిగా మరచిపోయారు. మీరు పౌరులు అంటే అది విప్లవమూ! ఇతరులు పౌరులు అంటే అది వర్గ సంకర!! ఇలాంటి పిల్లచేష్టల కారణంగానే కమ్యునిస్టుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఛీ కొట్టారు!

అయితే, "ఇది మీ సంస్థ  పౌరసమాజం గురించిగానీ, సాధారణ అర్థంలో వాడే పౌరసమాజం గురించిగానీ అన్నది కాదు." అని విరసం కార్యదర్శి ఒక వింత వాదన చేస్తున్నారు. నిర్దిష్ట అర్ధమూ, సాధారణ అర్ధమూ కాకుండా మరో అర్ధం ఏముంటుందో  విరసం కార్యదర్శి వివరించాలి. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద మీ దాడిని విరసం ఆమోదించిందన్నదే ఇక్కడ కీలకం. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద విరసం దాడి చేసిందన్నదే ఇక్కడ ప్రాణప్రదమైన అంశం.

ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఎన్నడూ విరసం మీద దాడిచేయాలని అనుకోలేదు. విరసమే మహాసభల వేదిక సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద దాడి చేసింది. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఇప్పుడు కూడా విరసం మీద ప్రతిదాడి చేయాలని అనుకోవడంలేదు. ఇక ముందు విరసంతో సోదర సంబంధాలను వదులుకోవాలని మాత్రమే భావిస్తోంది.

శెలవు

ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం వర్ధిల్లాలి.

ఏం యం ఖాన్ యజ్దానీ (డానీ)
కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం.



Sir, pani metho matladanani chepparu..??



పాణీ నాతో మాట్లాడారు. విషయం ఏదైనాసరే  కాగితం మీద వుండడం మంచిదని నేను భావిస్తున్నాను.
నేను హిందూత్వ అంశం మీద వేరే లేఖ రాస్తాను.


విప్లవ రచయితల సంఘానికి
ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం
బహిరంగలేఖ

Hydearbad
27-1-2016

(ముందుగా చెప్పిన ప్రకారం మూడు రోజులు ఆగి ప్రకటిస్తున్నాం)

రివేరాగారూ !

మీ వివరణ కోసం రెండు రోజుల గడువు ఇచ్చాము. దాన్ని ఇంకో మూడు రోజులు పోడిగించాము. అయినా మీరు స్పందించలేదు. రాళ్ళు వేయడమేతప్ప సంవాదం మీ విధానం కాదనుకుంటా!. ఇక విరసం మీద బహిరంగ ప్రకటన చేయడంతప్ప మాకు మరో మార్గం లేదు.

మీరు ఒక వివాదానికి తెరతీశారు. నేను నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద కొన్ని విమర్శలు చేశారు. దానికి ఫేస్ బుక్,  విరసంలను వేదికగా  వాడారు. అందువల్ల ఈ వివాదం  వ్యక్తిగతం కాకుండా సంస్థాగతంగా మారింది.

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అవసరాలు, కోరికలకూ, ప్రభుత్వ పనితీరు,  ఆబ్లిగేషన్లకూ మధ్య అగాధం విపరీతంగా పెరిగిపోతున్నదనీ, దాన్ని పూరించడానికి పౌరసమాజం పూనుకోవాలనే నిరాడంబర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఆవిర్భవించింది. ఇది కొత్త అన్వయం, కొత్త సంస్థ, ఇంకా సన్నాహక దశలోనేవుంది.

విరసం ప్రకటిత లక్ష్యం పీడిత ప్రజల పక్షాన నిలబడడం కనుక దాన్ని మేము సోదర సంస్థగా భావిస్తాము. గొప్ప ప్రజాకవి, ఆలోచనాపరుడు మాత్రమేగాక వ్యక్తిగతంగానూ నాకు ఆత్మీయులు అయిన వరవరరావు  విరసంలో వుండడంవల్ల కూడా ఆ సంస్థ మీద మాకు అపార గౌరవంవుంది.

ఐక్యసంఘటన సాగించాల్సిన చారిత్రక సందర్భంలో  వివాదాన్ని ముందు మీరు మొదలెట్టారు. ఫేస్ బుక్ లోని మా వాల్ లోనికి వచ్చి నన్నూ, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరసమాజాన్నీ ఎద్దేవ చేశారు. పౌరసమాజం  కన్వీనర్ గా మారాక కందమూల ఫలాలు, ఆకులూ అలములు తింటున్నానుగానీ స్వతహాగా నేను మాంసాహారినే. అది మీకూ తెలుసు.  మీరు నామీదా, మాసంస్థ మీదా బహిరంగంగా చేసిన విమర్శకు ప్రతిగా నేను మీమీదా, మీసంస్థ  మీదా  ఆ క్షణంలోనే బహిరంగ విమర్శ చేయాలి. నేనూ, నా సంస్థ పనికిమాలినవాళ్ళం అని మీరు అనగలిగినపుడు మీరూ, మీ సంస్థా  పనికిమాలినవి అనడానికి ఎంతసేపు పడుతుందీ? కేవలం వరవరరావు మీద గౌరవంతో నేను ఆ పనిచేయలేదు. నేను పాటించిన ఒక వున్నత సాంప్రదాయాన్ని మీరు నా బలహీనతగా భావించారు.

ప్రజాస్వామిక విలువల్నీ, ఐక్యసంఘటన ధర్మాన్నీ  పాటిస్తూ నేను మీకు ఫోన్ చేసి మీకున్న అభ్యంతరం ఏమిటీ? అని అడిగాను. మాతో మీకు సైధ్ధాంతిక విబేధాలున్నాయనీ, వాటి గురించి ఫోనుల్లో కాకుండా సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం వుందన్నారు. నాకు తెలుసు మీరు సమగ్ర వాదనకు నిలబడరని. మీరు ప్రకటిత ’మావోయిస్టులు” కదా! మేధోరంగంలోనూ గెరిల్లా యుధ్ధాలు చేస్తారు. హిట్ అండ్ రన్!

ఆ తరువాత విరసం విజయవాడ మహాసభల (జనవరి 10) ప్రసంగంలో  మీరు  పౌరసమాజాన్ని ప్రస్తావించి విమర్శించారు.  మామీద మీ దాడిని సమర్థించుకోవడానికి  ఆంటోనియో గ్రామ్ స్కీ ని విమర్శించారు. ఇటలీలో కమ్యూనిస్టు పార్టీల మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని భావించిన  తరువాత గ్రామ్ స్కీ పౌరసమాజం భావనకు ప్రాణం పోశాడు. ఇటలీ అనుభవాన్ని  వర్తమానానికి  అన్వయిస్తే -  ఆంధ్రప్రదేశ్ లో డానీ పౌరసమాజాన్ని ఆరంభించాడంటే  అక్కడి  ప్రజలు కమ్యూనిస్టు పార్టీలని చీదరించుకున్నారనే తార్కిక అర్ధం వస్తుందని మీకు ముందుభయం వేసివుంటుంది. చరిత్రకు కొత్త సూత్రాలేమీ వుండవు పాతసూత్రాలే పనిచేస్తుంటాయి.

రెండవసారి మీరు దాడి చేశారని తెలిశాక కూడా మేము తొందరపడలేదు. పరిస్థితిని సమీక్షించడానికి ఇంకో రెండు వారాలు ఆగాము.  అసంఖ్యాక పీడిత సామాజిక వర్గాలకు ముప్పువున్న ప్రస్తుత తరుణంలో వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసంఖ్యాక సంఘాలు, వ్యక్తుల మధ్య సోదర సంబంధాలు వుండాలనీ, కొన్ని అపోహలు, విభేదాలూ వున్నప్పటికీ  సమస్యల  పరిష్కారం కోసం అణగారిన సమూహాలన్నీ కలిసి ముందుకు సాగాలని  మేము భావిస్తున్నాము. మీ విమర్శ మీద స్పందించడానికి ముందు అసలు  మీరు ఏమన్నారో మీ నుండే తెలుసుకోవాలను కున్నాము.  1. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం పనికి రాదని చెప్పాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది?  2. అసలు పౌరసమాజం భావన గురించి మీ అభిప్రాయం ఏమిటీ? 3. ఇది మీ అభిప్రాయమా? విరసం అభిప్రాయమా? అనే మూడు అంశాల మీద రాతపూర్వకంగా మీ వివరణ కోరాను. మీరు స్పందించలేదు.

మీ ఉపన్యాసాన్ని విందామని ఫేస్ బుక్ లో  arunatara - virasam వాల్ లోనూ, virasam వెబ్ సైట్‍ లోనూ వెతికాను. వాటిల్లో మీ ఉపన్యాసంతప్ప అందరి ఉపన్యాసాలూ వున్నాయి.  ఆ తరువాత విరసం కార్యదర్శి వరలక్ష్మీ, విరసం సభ్యులు  మరి కొందరితో  సంవాదం సాగింది. వాళ్ల మెసేజులు, ఫోన్ సంభాషణలనుబట్టి మీరు మీ శక్తిమేరకు  ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద సైధ్ధాంతిక దాడి చేశారని తెలిసింది. "the approach and the theoretical depth is appreciated" అని మీ ఉపన్యాసాన్ని విరసం కార్యదర్శి మెచ్చుకున్నారు.  "మావోయిస్టులుగా మేమిది  వర్గసమాజం అని చెప్తాం. రివేరా అన్నది ఇది. వర్గ దృష్టిని ఆయన emphasize చేశారు." అని వారు ఒక వివరణ కూడా ఇచ్చారు.

వర్గము అనేది కమ్యూనిస్టు ప్రత్యయం, పౌరులు అనేది (పెట్టుబడీదారీ) ప్రజాస్వామ్య ప్రత్యయం -  అని మీరు ఆ ఉపన్యాసంలో వాదించి వుంటే నేను మిమ్మల్ని మెచ్చుకుని వుండేవాడిని. అయితే ఈ విషయంలోనూ మీకు చిత్తశుధ్ధిలేదు. మావోయిస్టులయిన రచయితలు విరసాన్ని నడుపుతున్నట్టు, మావోయిస్టులయిన న్యాయవాదులు పౌరహక్కుల సంఘాన్ని నడుపుతున్నారన్న విషయాన్ని మీరు తెలివిగా మరచిపోయారు. మీరు పౌరులు అంటే అది విప్లవమూ! ఇతరులు పౌరులు అంటే అది వర్గ సంకరమూ!! ఇలాంటి పిల్లచేష్టల కారణంగానే కమ్యునిస్టుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఛీ కొట్టారు!

అయితే, "ఇది మీ సంస్థ  పౌరసమాజం గురించిగానీ, సాధారణ అర్థంలో వాడే పౌరసమాజం గురించిగానీ అన్నది కాదు." అని విరసం కార్యదర్శి ఒక వింత మినహాయింపును కోరే ప్రయత్నం చేశారు. దేనికయినా నిర్ధిష్ట  అర్ధమూ, సాధారణ అర్ధమూ కాకుండా మరో అర్ధం ఏముంటుందో  విరసం కార్యదర్శి వివరించాలి. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద మీ దాడిని విరసం ఆమోదించిందన్నదే ఇక్కడ కీలకం. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద విరసం దాడి చేసిందన్నదే ఇక్కడ ప్రాణప్రదమైన అంశం.

ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఎన్నడూ విరసం మీద దాడిచేయాలని అనుకోలేదు. విరసమే మహాసభల వేదిక సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద దాడి చేసింది. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఇప్పుడు కూడా విరసం మీద ప్రతిదాడి చేయాలని అనుకోవడంలేదు. ఇక ముందు విరసంతో సోదర సంబంధాలను తెంచుకోవాలని మాత్రమే భావిస్తోంది.

శెలవు

ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం వర్ధిల్లాలి.

ఏం యం ఖాన్ యజ్దానీ (డానీ)
కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం.

No comments:

Post a Comment