Monday 25 January 2016

ఇళ్లు వాకిళ్లు వదులుకోలేం..

ఇళ్లు వాకిళ్లు వదులుకోలేం..
25-01-2016 06:24:55

  • ఎక్స్‌ప్రెస్‌హైవే తమ ఇళ్ల మీదుగా ఉంటుందని ఆందోళన 
  •  సమావేశం నిర్వహించిన తుళ్లూరు రైతులు , గ్రామస్తులు 
  •  మ్యాప్‌ను మార్చుకోవాలంటూ హెచ్చరిక
తుళ్ళూరు: మా గృహాలకు ముప్పు వాటిల్లకుండా రోడ్లు వేసుకోండి, కాని మా ఇళ్లు, వాకిళ్ల జోలికి మాత్రం రావద్దని తుళ్ళూరు రైతులు పేర్కొన్నారు. అందరిదీ ఒకే మాటగా తీర్మానించుకున్నారు. ఎక్స్‌ప్రెస్‌ హైవే తుళ్ళూరుకి తూర్పు, దక్షిణ భాగంలో ఇళ్ల మీద నుంచి వెళుతున్నట్లు తెలియటంతో, రైతులు ఆదివారం రావెల సుబ్బారావు ఆవరణలో సమావేశం అయ్యారు. పొలాలతో పాటు ఇళ్లు వదులుకోవటానికి సిద్ధంగా లేమని సమావేశంలో రైతులు, గ్రామస్తులు పేర్కొన్నారు. తాతల ముత్తాతల కాలం నుండి నివాసాలుండే వాటిని ఖాళీ చేయించాలని చూస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. మేమిచ్చిన పొలాలు ఉన్నాయి... వాటిల్లో నుంచి మీరు ఏ రోడ్డు వే సుకున్నా మాకు అభ్యంతరం లేదని వారు సమావేశంలో పేర్కొన్నారు. దాదాపు రెండు వందల మంది నివాసాల వారు సమావేశానికి హాజరయ్యారు. ఎటువంటి తమకెవరికీ రోడ్డు వేయానికి ఇష్టం లేదని సూచించారు. కనుక మ్యాప్‌లో ఉన్న ఎక్స్‌ప్రెస్‌ వేలను మార్చుకోవాలని అన్నారు. కాదని ఇళ్ళ జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేశారు.

No comments:

Post a Comment