|
న్యూఢిల్లీ, ఆగస్టు 25 : విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లి చెప్పారు. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసిన అనంతరం అరుణ్‌జైట్లి మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని మూడు కీలక సెక్షన్లపై చర్చ జరిగిందని, ఏపీకి న్యాయం చేకూర్చే సెక్షన్లపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీల అమలుకు ప్రధాని కట్టుబడి ఉన్నారు. సెక్షన్ 90 విషయంలో రోడ్‌మ్యాప్ రూపొందించాలని నితి ఆయోగ్‌ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 46, 90, 94లో ఏపీకి సంబంధించిన అంశాలున్నాయని, విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామని అరుణ్‌జైట్లి వివరించారు. పోలవరంపై చర్చించారా అని విలేకరులు ప్రశ్నించగా ఆ ప్రాజెక్టుకు పెద్దగా నిధులు కేటాయించలేదు కదా అని జైట్లీ తెలిపారు. సెక్షన్ 90లో పొందుపర్చిన పొందుపర్చిన పోలవరంపై కూడా చర్చించినట్లు అరుణ్.జైట్లీ చెప్పారు. ఈ సమావేశంలో పీఎంవో, ఆర్థికశాఖ, ఏపీ ప్రభుత్వ అధికారులు, నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు కూడా సమావేశంలో పాల్గొన్నారు |
No comments:
Post a Comment