Saturday, 8 August 2015

APJF - Delhi Dharna

7-8-2015
16 hrs · 
 

ఈరోజు ఏపి కి ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ లో ఏపి జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా చేసారు. దీనికి ఉద్యోగ సంఘాలు, టిడిపి ఎంపీలు మద్దతు తెలిపారు.... న్యూస్.

సుమారుగా 150 మంది తో ఢిల్లీ వెళ్లి, ఉదయం 11 గం లకు జంతర్ మంతర్ కి చేరుకొని, మధ్యాహ్నం 2.15 గం లకు జనగణమన పడేసి, మూడుగంటల్లో మమ అనిపించారు మన నాయకులు. దీనికి లక్షల రూపాయల ఖర్చు. ఢిల్లీ దాకా ప్రయాణం. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా? అన్నారు వేమన. పేరుకు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ధర్నాయే కానీ, పాల్గొన్నది ఉద్యోగ సంఘ ప్రతినిధులు, విద్యార్ధి సంఘాలు (?). మొత్తం జర్నలిస్టులు అరడజను మంది కూడా లేరు. ఎంతో ఆశించి, వెనకుండి ధన సహాయం చేసిన తెదేపా ఎంపీ కూడా నిరుత్సాహపడ్డారట ఈ ధర్నా చూసి.

మళ్ళీ ప్యాకేజీల ముఠాలు బయలు దేరాయి. వీరికి ప్రత్యేక హోదా అనేది ఒక ప్రత్యేక ఉపాధి హామీ పథకం లా తయారయ్యింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్రాన్ని విడగోట్టేదాకా నిద్రపోలేదు వీళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై చూపిస్తున్న అలసత్వాన్ని వీళ్ళు మంచి అవకాశంగా మలుచుకుంటున్నారు. ప్రతీ గ్రూపుకి గాడ్ ఫాదర్స్ వున్నారు. వాళ్ళ కనుసన్నల్లోనే ఈ ధర్నాలు, ఉద్యమాలు జరుగుతున్నాయి.

ఆర్దికలోటు తో అయోమయ స్తితిలో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక హోదా ప్రకటించడం, విభజన చట్టం ప్రకారం హామీలు నెరవేర్చడం అత్యవసరం. కానీ, దురదృష్టవశాత్తు వీటికొరకు పోరాడే నాయకులలోనే చిత్తశుద్ధి లేదనేది వాస్తవం. వీరి చర్యల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఏపికి. ఇంకేం బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్?

(స్టేజ్ మీద కూర్చున్న వారే తప్ప, స్టేజ్ ముందు ఎవరూ లేరని ఢిల్లీ నుంచి నా మీడియా మిత్రుడు చెప్పాడు. రేపు మన పచ్చ పేపర్లలో చూడండి. ఢిల్లీ లో మహా ధర్నా అంటూ విపరీతమైన బిల్డప్ ఇస్తారు)
— with YS Vijayamma YsrcpYV Subba ReddySomu Veerraju and 41 others.

No comments:

Post a Comment