Wednesday, 19 August 2015

ఆంధ్రప్రదేశ్‌ పౌరసమాజం

ఆంధ్రప్రదేశ్‌ పౌరసమాజం
ప్రజల అవసరాలకు, ప్రభుత్వ ఆబ్లిగేషన్లుకు మధ్య చాలా పెద్ద అగాధం ఉంది. ఈ అగాధం రోజురోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఈ అగాధాన్ని తగ్గించడం నేటి చారిత్రక అవసరం. ఆ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పౌరసమాజంపై ఉంది. చారిత్రక సంది సమయంలో ఒక చారిత్రక బాధ్యతను నిర్వర్తించడానికి ఆంధ్రప్రదేశ్‌ పౌరసమాజమనే సంస్థను నెలకొల్పాలని సంకల్పించాము. ఆంధ్రప్రదేశ్‌ పౌరసమాజం, ఆవిర్భావ సమావేశం ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గుంటూరులోని వజ్రం హోటల్‌లో జరుగుతుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనే కాక కొత్త రాష్ట్రంలోని జిల్లాలన్నింటిలో ప్రాంతీయ సమస్యల పరిష్కారంతోపాటు ఇంకా అనేక సమస్యలపై ఉద్యమిస్తున్న శక్తులన్నింటినీ ఒక వేదిక మీదకు తేవడం ఆంధ్రప్రదేశ్‌ పౌరసమాజం సంస్థ తన తొలి లక్ష్యంగా భావిస్తోంది. ఇది అందరి సంఘం. ఏ ప్రజా సంఘంలో పనిచేస్తున్నవారైనా, ఏ రాజకీయ భావాలు గలవారైనా, ఏ వృత్తిలో ఉన్నవాళ్లయినా ఆంధ్రప్రదేశ్‌ పౌరసమాజం సంస్థలో సభ్యులుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ పౌర సమాజం సంస్థ ప్రధాన లక్ష్యం ప్రజల పక్షం వహించడం ఒకటే కొలమానం.
 
ఈ నెల 23వ తేదీన జరిగే ఆవిర్భావ కార్యక్రమంలో కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, రైతు, రైతు కూలీల ప్రతినిధులు, వివిధ మహిలా, యువజన, విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్న ప్రతినిధులు, ఐటీ ప్రొఫెషనల్స్‌, న్యాయవాదులు, డాక్టర్లు, జర్నలిస్టులు, వివిధ ప్రజాసంఘాల్లో, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ పౌరసమాజం సంస్థ విధాన ప్రకటన రూపొందించటానికి వీలుగా మీ సూచనలను ఈ నెల 21లోపు రాతపూర్వకంగా పీడీఎఫ్‌ ఫార్మట్‌లో .... అనే ఐడీకి పంపితే వాటి ప్రతులను సన్నాహ సమావేశంలో పాల్గొన్న సభ్యులందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఆసక్తి కలవారు ఈ నెల 21లోపు వివరాలు పంపాలి.
- ఏ.యం. ఖాన్‌ యజ్దానీ (డానీ)

http://www.andhrajyothy.com/Artical?SID=142210

No comments:

Post a Comment