Thursday, 15 October 2015

Future Programme

Future Programme

భవిష్యత్ కార్యక్రమం

కో-కన్వీనర్లు, క్రియాశీల కార్యకర్తలు, కార్యకర్తలకు,

మిత్రులారా!

ఆవిర్భవించిన రెండు నెలల్లోనే  ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఒక కొత్త శక్తిగా అవతరించిందిఅందుకు సంస్థలోని ప్రతి ఒక్కరూ అభినందనీయులు.

ఇప్పుడు మనం రాయలసీమ ప్రాంతీయ సదస్సు మీద దృష్టిపెట్టాలి. అలాగే దక్షణాంధ్ర ప్రాంతీయ సదస్సు జరపాల్సివుంది. ఈలోపులోనో, చివర్నో కీలకమైన రాజధాని ప్రాంత సదస్సు నిర్వహించాలి మూడూ మనం తక్షణం చేయాల్సిన పనులు.

ప్రాంతీయ సదస్సులు పూర్తికాక ముందే జిల్లా సదస్సులు, డివిజన్ సదస్సులు  నిర్వహించాలని కూడా కొన్ని ప్రతిపాదనలు వస్తున్నాయి. మన మీద ప్రజలకు నమ్మకం పెరుగుతోందనడానికి ఇది నిదర్శనంమన బాధ్యతలు పెరుగుతున్నాయనడానికి కూడా  ఇది సంకేతం.

ప్రాంతీయ సదస్సులు ముగిసిన తరువాత మన సంస్థ విస్తృత కార్యవర్గ సమావేశం వుంటుందిఅప్పటి వరకు మన ముందుకు వచ్చిన  ప్రజాసమస్యల్నీ, వాటికి ప్రజలు కోరుకుంటున్న పరిష్కారాల్ని  సమావేశంలో ఒక జాబితాగా తయారుచేస్తాము. జాబితాను ఒక ప్రతినిధి బృందం ద్వార రాష్ట్ర  ప్రభుత్వాధినేత, ప్రధాన కార్యదర్శిలతో పాటూ అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర బాధ్యులకు అందజేస్తాము పనుల్ని మనం 2016 జనవరి నెలాఖరు లోగా  పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.

తరువాత మళ్ళీ మనం భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుందాము.

మీ సూచనల్ని ఆహ్వానిస్తున్నాను.

అభినందనలతో
- డానీ
కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం

15 అక్టోబరు 2015 

No comments:

Post a Comment