భూములు ఇవ్వని రైతులకు విద్యుత్ కనెక్షన్ కట్ Updated :12-10-2015 14:27:54 |
తూర్పుగోదావరి : కాకినాడ సెజ్‌లో భూములు ఇవ్వని రైతులకు అధికారులు విద్యుత్ కనెక్షన్‌లు కట్ చేశారు. దీంతో రైతులందరూ పీఠాపురం ఉప్పాడ సెంటర్‌లోని గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ... సెజ్‌కు భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడమేగాక బెదిరింపు ధోరణులకు పాల్పడుతోందన్నారు. నేడు విద్యుత్ కనెక్షన్‌లు కట్ చేయించిన ప్రభుత్వం రేపు తమను ఏం చేస్తుందో అంటూ వారు వాపోయారు.
|
No comments:
Post a Comment